న్యూ సౌక్‌ వకిఫ్‌ అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ ప్రారంభం

- November 11, 2016 , by Maagulf
న్యూ సౌక్‌ వకిఫ్‌ అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ ప్రారంభం

న్యూ అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ - సౌక్‌ వకిఫ్‌లో నేటి నుంచి విజిటర్స్‌ కోసం ప్రారంభించబడింది. ఈ కాంప్లెక్స్‌లో వృద్ధులకు అలాగే ప్రత్యేకావసరాలుగలవారికి మొత్తం 650 వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. మషీరెబ్‌ మరియు ఫాల్కన్‌ మార్కెట్‌ నుంచి ప్రవేశం అలాగే ఎగ్జిట్‌ ఈ పార్కింగ్‌ ఏరియాకి ఉంది. ఈ పార్కింగ్‌ ఏరియాకి పూర్తిస్థాయిలో భద్రత కల్పించారు. నిరంతరం సిసిటీవీ పర్కవేక్షణలో ఉంటుంది ఈ పార్కింగ్‌. ఇందులో ఐదు సినిమా థియేటర్లున్నాయి. వచ్చే ఏడాది ఇవి ప్రారంభమవుతాయి. సౌక్‌ వకిఫ్‌ నుంచి మొత్తం 38 స్టోర్స్‌ ఈ బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. 12 ఆటోమేటెడ్‌ పేమెంట్‌ డివైజెస్‌ని పార్కింగ్‌ ఫీజుల చెల్లింపు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఎలివేటర్లు ఇందులో ఉండగా, వాటిల్లో 2 సినిమా ప్రాంతం కోసం ఏర్పాటు చేశారు. 9 ఎమర్జన్సీ ఎంట్రన్స్‌ మరియు ఎగ్జిట్స్‌ కూడా ఉన్నాయి. గంట సమయానికి మినిమమ్‌ 3 ఖతారీ రియాల్స్‌ పార్కింగ్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా 24 గంటల కంటే ఎక్కువగా ఇక్కడ పార్కింగ్‌కి అనుమతించరు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com