మాగడి పోలీసులకు లొంగిపోయిన దర్శకుడు, ఫైట్‌మాస్టర్
- November 13, 2016
మాస్తిగుడి చిత్రీకరణ సమయంలో నటులు ఉదయ్, అనిల్ లు మృతికి కారకులైన సినిమా దర్శకుడు నాగశేఖర్, సహాయ దర్శకుడు సిద్దూ, ఫైట్‌మాస్టర్ రవివర్మలు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మాగడి పోలీస్ స్టేషనకు వచ్చిన వారు లొంగిపోయారు. ఇప్పటికే నిర్మాత సుందర్ పి.గౌడ అరెస్టు కాగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మిగిలిన ముగ్గురు నాలుగు రోజులుగా తప్పించుకుపోగా శనివారం వారే నేరుగా పోలీస్ స్టేషనకు వచ్చి లొంగిపోయారు. నటుడు దుని యా విజయ్ వీరిని స్వయంగా పోలీసుస్టేషనకు తీసుకువచ్చారు. మీడియా విజయ్ను మాట్లాడే ప్రయత్నం చే యగా తాను ఇంకా షాక్‌లో ఉన్నానని ఎ లాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని బదులిచ్చారు. అనంతరం న్యాయమూర్తి వీరికి ఈనెల 25వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







