జి సి సి కార్మిక మంత్రుల చర్చలు... విదేశీ కార్మికులపై దృష్టి

- November 13, 2016 , by Maagulf
జి సి సి  కార్మిక మంత్రుల చర్చలు... విదేశీ కార్మికులపై దృష్టి

 రియాద్: గల్ఫ్ దేశాల సమాఖ్య కు  చెందిన కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జరిగిన పరస్పర ఆందోళన చర్చలలో ముఖ్యంగా కౌన్సిల్ యొక్క పని అభివృద్ధి ఏ విధంగా చేయాలని, అలాగే,  సాధారణ పని విధానాల సక్రియం చేయడం  మరియు గల్ఫ్ యూనియన్ అవసరాలు సాధించడానికి ఎలా కృషి చేయాలో అని ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. 

ఈ సమావేశాలు నాలుగు రోజుల పైగా జరగనున్నాయి. ఆయా దేశాల మంత్రులకు సంబంధించిన పలువురు  సెక్రటరియేట్ల సన్నాహక సమావేశాలు తొలుత జరగనున్నాయి. కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి ముఫరేజ్  అల్ హఖ్అబానీ మాట్లాడుతూ, తమ దేశాల్లో ఉన్న విదేశీ కార్మికుల స్థితి మరియు కార్మిక మరియు సామాజిక అభివృద్ధి సవాళ్లు వారి డైరెక్టరేట్లు ఎదుర్కొంటున్న సమస్యలు గూర్చిగల్ఫ్ మంత్రులు గల్ఫ్ దేశాల సమాఖ్య దేశాలలో అందుకు తగిన వ్యూహాలు చర్చించడానికి ఈ సమావేశం దోహదపడనుంది.  అలాగే  జీసీసీ దేశాలలో స్వంత దేశంలోని యువతకు జాతీయ క్యాడర్ ఉపాధి రేట్లు పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాల పురోగతిని అంచనావేసే వార్షిక నివేదిక గురించి చర్చిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com