అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది..
- November 13, 2016
అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సోమవారం రాత్రి పూర్ణచంద్రుడు ఆకాశంలో చాలా పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 68ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అద్భుత అవకాశాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని నాసా తెలిపింది.
భూమికి దగ్గరగా రావడంతోనే చంద్రు డు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడని వెల్లడించింది. 1948లోనూ పూర్ణచంద్రుడు ప్రకాశవంతంగా కనిపించినా ఎక్కువ మంది ప్రజలు చూడలేకపోయారని తెలిపింది. మళ్లీ ఇలాంటి అద్భుతం కనిపించాలంటే 2034 వరకు ఆగాల్సిందేనని చెప్పింది..దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న భూమికి చంద్రుడు కొన్ని సమయాల్లో దగ్గరగానూ మరికొన్ని సమయాల్లో దూరంగా జరుగుతాడని తెలిపింది.భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడని పేర్కొంది. కాగా, చంద్రుడికి భూమి దూరంగా జరుగడాన్ని అపోజీ అని, దగ్గరగా వచ్చేదానిని పెరిజీ అంటారు.సాధారణంగా పెరిజీ 14శాతం పెరుగడంతో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అదే సమయంలో చంద్రుడు రోజు కంటే 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడని నాసా పేర్కొంది. ఈ అద్భుతాన్ని భారత్‌లోనూ వీక్షించవచ్చని నాసా డిప్యూటీ ప్రాజెక్టు శాస్త్రవేత్త నహ్ పెట్రో వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







