ఆంగ్లపడం చిత్రం ఈ నెల 25న విడుదల....
- November 13, 2016
నటుడు రాంకీ చాలా కాలం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం ఆంగ్లపడం. ఆయనతో పాటు సంజీవ్ మరో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటి మీనాక్షి, శ్రీజ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సింగంపులి, సింగముత్తు, మధుమిత నటించారు. ఆర్‌జే. మీడియా క్రియేషన్‌స పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు కుమరేశ్‌కుమార్ పరిచయం అవుతున్నారు. ఎంసీ.గిరీశ్ సం గీతాన్ని, సాయిసతీష్ ఛాయాగ్రహణాన్ని అం దించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకు ముస్తాబవుతోంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ హా లీవుడ్ చిత్రాల తరహాలో అనూహ్య కథ, కథనాలతో చిత్రం జెట్ స్పీడ్‌లో సాగుతుం దని, అందుకే దీ నికి ఆంగ్లపడం అన్న టైటిల్‌ను నిర్ణయించి నట్లు తెలిపారు.నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథను చాలా మంది నటులకు చెప్పానన్నారు.అయితే వారంతా చాలా బాగుందని, నువ్వు చెప్పినట్లు చిత్ర కథను తెరకెక్కించగలవా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారన్నారు. ఆ తరువాత రాంకీ, సంజీవ్ నటించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ చూడని రాంకీని ఈ చిత్రంలో చూడనున్నారని తెలిపారు. అదే విధంగా తమిళ తెరకు ఆంగ్లపడం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







