భారత్ - జపాన్ అణు ఒప్పందానికి చైనా మద్దతు
- November 14, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ టోక్యో పర్యటన సందర్భంగా కుదిరిన భారత్ - జపాన్ అణు ఒప్పందానికి చైనా మద్దతు తెలిపింది. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడిన దేశాలకు శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని ఉపయోగించుకోడానికి హక్కు ఉంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాతో అన్నారు. భారత్-జపాన్ చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రం గురించిన ప్రస్తావన ఉండటంపైనా చైనా స్పందించింది. ఈ విషయంలో తాము తమ పాత విధానానికే కట్టుబడి ఉంటున్నట్లు తెలిపింది.
పౌర అణు ఒప్పందం మీద సంతకాలు కుదరడానికి ముందు చైనా మీడియాలో మాత్రం దీనిపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. కానీ మీడియా అభ్యంతరాలను గెంగ్ ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబుల బారిన పడిన ఏకైక దేశమైన జపాన్.. ఇన్నాళ్ల నుంచి ఎప్పుడూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం గురించిన విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జపాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) మీద సంతకాలు చేయని మొట్టమొదటి దేశం భారతదేశమే. ఎన్‌పీటీ మీద సంతకం పెట్టడానికి నిరాకరించడం వల్లే అణు సరఫరాదారుల బృందంలో భారతదేశం చేరడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ, అలాంటి చైనా ఇప్పుడు జపాన్ -భారత్ ఒప్పందానికి మద్దతు పలకడం ఆశ్చర్యంగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







