డిసెంబర్ 7న పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం

- November 14, 2016 , by Maagulf
డిసెంబర్ 7న పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం

పీఎస్‌ఎల్‌వీ-సి36ను వచ్చే నెల 7న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్‌ నుంచి నింగిలోకి పంపాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సోమవారం షార్‌లోని కల్పనా కాన్ఫరెన్సు హాలులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాకెట్‌ సన్నద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్‌) నిర్వహించారు. షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌, పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఉపగ్రహ సంచాలకులు మహేష్‌లతోపాటు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌ తిరువనంతపురం, ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులోని శాస్త్రవేత్తలు రాకెట్‌ అనుసంధానం, ఉపగ్రహ పరీక్షలపై సమీక్షించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా డిసెంబరు 7న 10 గంటల్లోపు ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు.సమయాన్ని నిర్ధరించలేదు. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక 1225 కిలోల బరువు ఉన్న రిసోర్స్‌శాట్‌-2ఎ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com