ట్రాఫిక్ చలాన్లు వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు
- November 14, 2016
అబుదాబీ కమర్షియల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు కలిగిన వాహనదారులు, తమ ట్రాఫిక్ జరీమానాల్ని ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్‌తో ఈ పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. మూడు, ఆరు, 12 నెలల వ్యవధిలో వాయిదాలు చెల్లించవచ్చనీ, మినిమమ్ పేమెంట్ 500 దిర్హామ్‌లు అని అధికారులు చెప్పారు. దుబాయ్ పోలీస్ మరియు అబుదాబీ కమర్షియల్ బ్యాంక్ ఈ మేరకు ఓ అవగాహనను కుదుర్చుకున్నాయి. సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. దుబాయ్ పోలీస్ - ఫైనాన్స్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ హుమైద్ సలీమ్ అల్ సువైది మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ద్వారా జరీమానాల చెల్లింపు సులభతరం అవుతుందని అన్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు ఈ కొత్త విధానం అమల్లోకి తెచ్చామని అన్నారాయన. సర్వీస్ సెంటర్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, అలాగే దుబాయ్ పోలీస్ వెబ్ సైట్ ద్వారా కూడా జరీమానాల్ని చెల్లించవచ్చు. దుబాయ్ రూలర్ ప్రారంభించిన స్మార్ట్ దుబాయ్ ప్రాజెక్టులో భాగంగా ఈ స్మార్ట్ మూవ్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







