దుబాయ్ బస్సుల్లో ఉచిత వైఫై
- November 14, 2016
దుబాయ్ తాజాగా ఉచిత వైఫై సేవల్ని 106 ఇంటర్‌సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసింది. షార్జా నుంచి అబుదాబీకి నడిచే బస్సుల్లో ఈ సౌకర్యం కల్పించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) ఈ విషయమ్మీద స్పందిస్తూ, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే క్రమంలోనే ఈ ఉచిత వైఫైని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. స్మార్ట్ దుబాయ్ ప్రాజెక్టు భాగంగా ఉచిత వైఫై సేవల్ని బస్సుల్లో అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్యాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఈ వైఫైని వినియోగించుకోవచ్చు. ఎటిసలాట్‌తో కలిసి ఈ ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్‌టిఎ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ సిఇఓ అబ్దుల్లా యూసెఫ్ అలీ వివరించారు. ఈ సేవల్ని మరింత విస్తరించనున్నట్లు చెప్పారాయన. హైస్పీడ్ ఇంటర్‌నెట్‌ని ప్రయాణీకులు వినియోగించుకుని, తమ ప్రయాణాన్ని ఇంకా ఆహ్లాదభరితంగా మార్చుకోవచ్చని ఎటిసలాట్ బిజినెస్ సెక్టార్ సిఇఓ సల్వాడోర్ అంజ్‌లాడా చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







