సంప్రదాయబద్దంగా తమన్నా ....
- November 15, 2016
తెలుగు, తమిళం, హిందీ భాషలలో హవా చూపుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా పలు చిత్రాలలో గ్లామర్ షో బాగానే చేసింది. తన అందాలతో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్న బ్యూటీ ఇప్పుడు సంప్రదాయబద్దంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస హిట్ చిత్రాల హీరో విజయ్ సేతుపతి, గ్లామరస్ క్వీన్ తమన్నాలు నటించిన 'ధర్మధురై' అనే తమిళ చిత్రం ఆగస్ట్ నెలలో విడుదలైంది. ఈ చిత్రం మంచి హిట్ సాధించగా, ఇప్పుడు ఈ మూవీని తెలుగులో 'డాక్టర్ ధర్మరాజు ఎంబీబీఎస్' పేరుతో అనువదిస్తున్నారు. ఇందులో తమన్నా టీచర్ పాత్రలో కనిపించనుండగా, సినిమా అంతటా చీర కట్టులోనే కనిపించనుందట. సుధ సినిమాస్ బేనర్ మీద సాంబశివరావు తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నాడు.ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు
తాజా వార్తలు
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!







