పనామా పత్రాలు వ్యవహారం మరోసారి చర్చనీయాంశం
- November 15, 2016
ఏడు నెలల క్రితం సంచలనం సృష్టించిన పనామా పత్రాలు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచారన్న ఆరోపణలు నేపధ్యంలో భారతీయులపై ఆదాయ పన్ను శాఖ నిఘా సంస్థలు దృష్టి ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రధాని ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సిట్ 415 మంది భారతీయుల లావాదేవీలను పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే పనామా పత్రాల్లో పేర్లు బయటకు వచ్చిన 14 మంది వ్యక్తుల సంస్థలు, నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. త్వరలోనే మరిన్ని ఆధారాలు సంపాదించే పనిలో పడ్డారు.
భారతీయుల పేర్లతో విదేశాల్లో ఉన్న కంపెనీల వివరాలు కూడా సేకరించారు. ఆయా దేశాలకు వివరాలు కోరుతూ ఆదాయపన్ను శాఖ అధికారులు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. 198 మంది వ్యక్తులకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు, ఖాతాల వివరాలు కావాలంటూ ఆర్ధిక శాఖ పరిధిలోని ఫారిన్ టాక్స్ అండ్ టాక్స్ రీసెర్చ్ వింగ్ ద్వారా వర్జిన్ ఐలాండ్స్, బహమాస్, లగ్జంబర్గ్, జెర్సీ, సీషెల్స్, స్విట్జర్లాండ్, సైప్రస్ సహా 13 దేశాలకు లేఖలు వెళ్లాయి. అక్కడి నుంచి సమాచారం రాగానే అక్రమాలు జరిగినట్టు తెలిస్తే కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌కు చెందినవారే అధికంగా ఉండడం గమనార్హం. పనామా పత్రాల లీకుపై గతంలోనే ప్రధాని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ద్వారా విచారణ ఆదేశించారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. అంతర్జాతీయంగా పలు పరిశోధనా సంస్థలు కలిసి శోధించి ప్రపంచవ్యాప్తంగా అక్రమ మార్గాల్లో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖుల జాతకాలను బయటపెట్టింది. ఇందులో అమితాబ్, ఐశ్వర్య, అజయ్‌దేవ్‌గన్ వంటి సినీస్టార్లు, రాజకీయ నాయకులతో కలిపి మొత్తం 5వందల పేర్లు బయటకు వచ్చాయి. -
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







