కమల్‌ని కలిసిన రజనీ

- November 15, 2016 , by Maagulf
కమల్‌ని కలిసిన రజనీ

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తన చిరకాల మిత్రుడు, సీనియర్‌ నటుడు ఉలగనాయగన్ కమల్‌హాసన్‌తో సోమవారం రాత్రి హఠాత్తుగా భేటీ అయ్యారు. స్థానిక ఆళ్వార్‌పేటలో ఉన్న తన నివాసానికి వచ్చిన రజనీకి కమల్‌ ఇంటి గుమ్మం వద్దే నిలబడి సాదర స్వాగతం పలికారు. మలేషియాలో కబాలీ చిత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత రజనీకాంత అస్వస్థతకు గురై చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇక కమల్‌హాసన్ సైతం అమెరికాలో 'శభాష్‌నాయుడు' చిత్రం షూటింగ్‌లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చి తన కార్యాలయం మెట్లెక్కుతూ జారిపడ్డారు. ఈ ప్రమాదంలో కాలి ఎముక దెబ్బతిని ఆపరేషన్ చేసుకున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం '2.0' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండగా, కమల్‌హాసన్ శబాష్‌నాయుడు షూటింగ్‌లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు.ఇరువురూ అనారోగ్యంపాలై కోలుకున్న తర్వాత సీని ఫంక్షన్‌లలో ఇరువురూ పాల్గొనలేదు. ఈ పరిస్థితులలో రజనీకాంత్, కమల్‌ హాసన్‌ను కలుసుకుని పరామర్శించారు. ఇరువురూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు అడిగి తెలుసుకున్నారు. సమాచారం. చాలా గ్యాప్‌ తర్వాత కలుసుకోవడంతో ఇరువురూ తీవ్ర ఉద్వేగానికి గురైనట్లు సమాచారం.

'తూంగావనం' దర్శకుడు, ప్రస్తుతం కమల్‌హాసన్ సహాయకుడిగా ఉంటున్న రాజేష్‌ ఎం.సెల్వా ఆ ఇరువురితో నిలబడి తీసుకున్న ఫోటో ఫేస్‌బుక్‌లో వెలువడంతో కమల్‌, రజనీ రహస్య భేటీ వెలుగులోకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com