మరో రాజకీయ నేపధ్య సినిమా తీయనున్న మణి రత్నం
- November 16, 2016
ఎలాంటి కథతోనైనా మేజిక్ చేయగల సమర్థుడు మణిరత్నం. సెల్యులాయిడ్ వేదికగా చేసుకొని ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఏ జోనర్ కథని తెరకెక్కించినా అందులో తనదైన మార్క్‌ని జోడించి ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఆయన దృష్టి మరోసారి రాజకీయాలపై పడిందని సమాచారం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధిల స్ఫూర్తితో ఆయన తీసిన 'ఇద్దరు' అప్పట్లో విశేష ఆదరణని సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఆ తరహాలోనే మరోసారి రాజకీయ నేపథ్యమున్న చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. 'ప్రతిపక్షం' అనే అర్థం వచ్చే పేరుతో తమిళంలో ఆయన ఓ చిత్రం తెరకెక్కించనున్నట్టు సమాచారం.
అందులో ఓ యువ కథానాయకుడు ముఖ్య భూమిక పోషిస్తారని తెలిసింది. తమిళంలో తెరకెక్కుతోందంటే అది తెలుగులో విడుదలవడమూ తప్పనిసరి. ప్రస్తుతం కార్తి కథానాయకుడిగా 'డ్యూయెట్' అనే సినిమాని చేస్తున్నారు మణిరత్నం. ఆ చిత్రం విడుదలయ్యాకే కొత్త సినిమా కబుర్లు అధికారికంగా బయటికొచ్చే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







