ట్యాక్స్‌ హైక్‌ తప్పదేమో

- November 16, 2016 , by Maagulf
ట్యాక్స్‌ హైక్‌ తప్పదేమో

మనామా: ఈ ఏడాది 10 నుంచి 15 శాతం వరకు పన్నులు పెరగవచ్చునని ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 300 డెసిషన్స్‌ని ప్రభుత్వం జారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయనీ, వీటిల్లో కొత్త ఫీజులు, అలాగే ఉన్న ఫీజుల పెంపు వంటివి ఉన్నాయని ఎంపీ చెప్పారు. ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ కమిటీ డిప్యూటీ ఛైర్మన్‌ మొహమ్మద్‌ అల్‌ అహ్మద్‌ ఓ సందర్బంలో ఈ వివరాలు వెల్లడించారు. పార్లమెంటుతో సంబంధం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు బహ్రెయినీ సిటిజన్లకు ముందుగా ఇబ్బందులు కగజేస్తాయని చెప్పారాయన. పబ్లిక్‌ సర్వీస్‌ రుసుములు వచ్చే ఏడాది 10 నుంచి 15 వరకు పెరగవచ్చునని స్టడీస్‌ చెబుతున్నట్లు వివరించారు అల్‌ అహ్మద్‌. పాస్‌పోర్టులు, ఇమ్మిగ్రేషన్‌, జ్యుడీషియల్‌ సర్వీసులు, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్‌, లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ సర్వీసెస్‌ వంటివి అదనపు భారం కాగలవని కమిటీ మెంబర్‌ అహ్మద్‌ కరాటా చెప్పారు. బహ్రెయినీల బారోయింగ్స్‌ 10శాతం పెరిగినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ని కోట్‌ చేస్తూ చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com