కతర్ లో నీటిని,విద్యుత్ ను వృధా చేసేవారికి 20,000రియాల్స్ జరిమానా

- November 16, 2016 , by Maagulf
కతర్ లో నీటిని,విద్యుత్ ను వృధా చేసేవారికి 20,000రియాల్స్ జరిమానా

దేశవ్యాప్తంగా పారిశ్రామిక, వాణిజ్య మరియు నివాస సౌకర్యాలు వద్ద విద్యుత్ మరియు నీటి వృథా అవుతున్నాయిని వాటి నిషేధానికి త్రశీద్ చట్టం అమలు పరచే ప్రయత్నం జరుగుతుంది, కతర్ జనరల్ విద్యుత్ మరియు అగ్ని కార్పొరేషన్  కాహారమా భారీ తనిఖీ కార్యక్రమమును చేపట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తనిఖీల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల ప్రసారాన్ని కాహారమా శక్తి సామర్థ్య కార్యక్రమ తర్షీద్  పెంచడానికి  ప్రారంభించింది. పరిరక్షణ మరియు శక్తి సమర్థత జాతీయ కార్యక్రమం (తర్షీద్ ) లీగల్ పర్యవేక్షణ విభాగం మంగళవారం  కాహారమా.లైవ్  ' అకౌంట్ కింద స్నాప్ఛాట్ లో ఒక వీడియోను ప్రసారం చేసింది. 

తర్షీద్ న్యాయ పర్యవేక్షణ విభాగపు ముఖ్యులు ఫాహ్డ్ అల్ హంజాబ్ మాట్లాడుతూ, న్యాయ అధికారాలు ఇన్స్పెక్టర్లు చట్టం సంఖ్య ౨౦,  2016 వివరించారు. దీని ప్రకారం తాగునీటితో వాహనాల  బాహ్య భాగాలను కడగడం నిషేధించారు. ఈ చట్టం ప్రకారం, భవనాల వెలుపల వెలిగే  లైట్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4:౩౦ వరకు వెలగరాదని  ఆ సమయంలో లైట్లు వెలిగితే ఒక దండన తప్పదని పేర్కొన్నారు. అలాగే నీటి కుళాయిల హెడ్డులని కట్టివేయక నీటిని వృధా చేస్తే అందుకు సైతం  చట్టం యొక్క ఉల్లంఘన నేరం కింద పరిగణించి జరిమానాలు విధిస్తారు. పైపు కట్టకపోవడం ద్వారా నీటి వృధా చేస్తే అందుకు తొలి తప్పుగా జరిమానా 20,000 క్యూ ఆర్  ఉంటుందని ,అదేవిధంగా విద్యుత్ ని వృధా చేస్తే 10,000 క్యూ ఆర్ జరిమానాలతో శిక్షింపబడతారని  అల్ హంజాబ్  వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com