ప్రముఖ వేణుగాన విద్వాంసుడుకు జీవితసాఫల్య పురస్కారం
- November 18, 2016
ప్రముఖ వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియాకు శాస్త్రీయ సంగీతంలో విశేష కృషి చేసినందుకు గాను జీవితసాఫల్య పురస్కారం లభించింది. ఉత్తరభారతదేశంలో కథక్, హిందూస్తానీ సంగీత వ్యాప్తికి కృషి చేసిన సుమిత్రా చరత్ రామ్ పేరిట 15 ఏళ్లుగా అవార్డులను అందజేస్తున్నారు. సుమిత్ర శ్రీరామ్ భారతీయ కళా కేంద్రం వ్యవస్థాపకురాలు. ఆమె కృషికి గుర్తుగా నృత్యం, సంగీతం విభాగాల్లో వ్యక్తిగతంగా ప్రతిభ చూపిన వారికి పురస్కారాలను అందజేస్తుంటారు.
2016 సంవత్సరానికి గాను.. .
పద్మవిభూషణ్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా 2016 సంవత్సరానికిగాను సుమిత్ర చరత్ రామ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
న్యూదిల్లీలోని కామని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతులమీదుగా చౌరాసియా పురస్కారం స్వీకరించారు. సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శేఖర్ సేన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువను, ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు శ్రీరామ్ భారతీయ కళా కేంద్రం డైరెక్టర్, వైస్ ఛైర్పర్సన్ శోభా దీపక్ సింగ్ అన్నారు. పురస్కారం కింద అభినందన పత్రం, శాలువా, వెండి పతకం అందజేసినట్లు ఆమె తెలిపారు.
గతంలో ఈ పురస్కారం అందుకున్నవారిలో.. పండిట్ బిర్జు మహారాజ్(కథక్), కిషోరి అమోంకర్(హిందూస్థానీ వోకల్), మాయాధర్ రౌత్(ఒడిస్సీ), పండిట్ జస్రాజ్(హిందూస్థానీ వోకల్), కుముదిని లఖియా(కథక్) ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







