వలసదారులపై జరీమానాలు పెరుగుతున్న ఆందోళన
- November 18, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, తదుపరి జాతీయ అసెంబ్లీలో కీలకమైన అంశాలకు మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 'ఓవర్ స్టే' చేస్తున్నవారిపై రోజుకి 2 కువైట్ దిర్హామ్స్ జరీమానా విధిస్తున్నారు. దీన్ని డబుల్ చేయడం అంటే 4 కువైట్ దినార్స్‌కి పెంచేలా నిర్ణయం జాతీయ అసెంబ్లీ ద్వారా వెలువడనుందని సమాచారమ్. అలాగే మేగ్జిమమ్ జరీమానా లిమిట్ ప్రస్తుతం 600 కువైట్ దిర్హామ్స్ ఉండగా, దాన్ని 1000కి పెంచవచ్చుననే ప్రచారం జరుగుతున్నది. అయితే అధికారులు ఎవరూ ఈ అంశాలపై స్పష్టతనివ్వడంలేదు. తమ పిల్లలు లేదా భాగస్వామికి స్పాన్సర్ చేయడం కోసం సేలరీ కేప్‌ని 250 కువైట్ దిర్హామ్స్ నుంచి 450 కువైట్ దిర్హామ్స్ వరకు పెంచారు. ఇది ఇంకా పెరగవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా దేశంలో వలసదారుల వర్క్ ఫోర్స్‌ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశ్యం దిగా ఉంది. ప్రస్తుతం కువైట్‌లో 1.3 మిలియన్ నేటివ్ సిటిజన్స్ ఉండగా 3 మిలియన్ల మంది వలసదారులు ఉన్నారు. ఇందులోనూ ఆసియన్ల సంఖ్య చాలా ఎక్కువ. 1 మిలియన్ మంది భారతీయులే ఇందులో ఉన్నారు. 650,000 మంది డొమెస్టిక్ హెల్పర్స్ వారిలో ఎక్కువగా మహిళలు వలసదారులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







