ఆటతోపాటే వివాదాలతోనూ గుత్తాజ్వాల....

- November 18, 2016 , by Maagulf
ఆటతోపాటే వివాదాలతోనూ గుత్తాజ్వాల....

ఆటతోపాటే వివాదాలతోనూ మీడియాకెక్కుతుంటుంది బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తాజ్వాల. తాజాగా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధు గురించి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ గురించి జ్వాల మాట్లాడింది. సింధుకు, సానియాకు దొరికిన సపోర్ట్‌ తనకు దక్కలేదని జ్వాల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 'ఇప్పటి వరకు నేను ప్రభుత్వాన్ని డబ్బులు అడగలేదు. ఎలాంటి అవార్డులనూ ఆశించలేదు. మొన్న సింధు ఒలింపిక్‌ పతకం గెలిచాక 'వాళ్ల కుటుంబం అంత కష్టపడింది. వాళ్ల నాన్నగారు ఎన్నో త్యాగాలు చేశారు' అంటున్నారు. సింధు వాళ్ల కుటుంబం కష్టపడింది. అందులో డౌట్‌ లేదు. అయితే ఓ క్రీడాకారుడి కుటుంబ సభ్యులు ఎవరైనా అంతే కష్టపడతారు. కానీ సింధుకి దొరికిన సపోర్ట్‌ నాకెక్కడిది.సానియాకు కూడా సపోర్ట్‌ దొరికింది. ఇలాంటివి మాట్లాడకూడదు. నేను ఫేమస్‌ అయ్యానంటే అది కేవలం నా ఆటతోనే. నాకెవరూ సపోర్ట్‌ చేయలేద'ని చెప్పుకొచ్చింది జ్వాల. అలాగే బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ డబుల్స్‌ను సపోర్ట్‌ చేయరని, అంతే తప్ప అతనితో తనకెలాంటి ఇబ్బందులూ లేవని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com