త్వరలో తండ్రి అవ్వనున్న నాని
- November 21, 2016
వరుస విజయాలతో జోరుమీదున్న నేచులర్ స్టార్ నాని తండ్రి కాబోతున్న ఆనందంలో ఉన్నారు. నాని, అంజన దంపతులకు త్వరలోనే పండంటి శిశువు జన్మించనుంది. గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో నాని తండ్రి కాబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే నాని టీమ్ ఇవాళ ఆ వార్తలను నిర్ధారిస్తూ.. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేసింది. 'ఒక గొప్ప ఆనందం రాబోతోంది. ఆ శుభవార్తను వినడం మాకు చాలా సంతోషంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి' అని నాని టీమ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతోపాటు తండ్రి కాబోతోన్న ఆనందంలో నాని.. అంజన సన్నిహితులతో సరదాగా ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. నాని ఎప్పట్లాగే చాలా హుషారుగా ఫొటోకు పోజిచ్చారు.
ఇటీవల 'మజ్ను' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నాని ప్రస్తుతం 'నేను లోకల్' చిత్రంలో నటిస్తున్నారు. కీర్తీసురేశ్ ఇందులో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







