'స్పైస్ జెట్' వారి స్పెషల్ ఆఫర్
- November 21, 2016
దేశీయ ప్రయాణికుల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సోమవారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 'స్పైసీ యాన్యువల్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఒకవైపు ప్రారంభ చార్జీ రూ.737గా పేర్కొంది. నేటి నుంచి ఈనెల 24 అర్ధరాత్రి వరకు ఈ పథకం టికెట్లను విక్రయించనున్నట్టు సంస్థ పేర్కొంది. టికెట్లు కొనుగోలు చేసిన వారు జనవరి, 9వ తేదీ నుంచి 28 అక్టోబరు 2017 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. చెన్నై-కోయంబత్తూరు-చెన్నై, జమ్ము- శ్రీనగర్-జమ్ము, చండీగఢ్-శ్రీనగర్-చండీగఢ్, అగర్తలా-గువాహటి మధ్య రూ.737 ప్రారంభ టికెట్ల ధరతో ప్రయాణించ వచ్చని వివరించింది.నాన్‌స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, దూరాలను బట్టి ధరలో తేడా ఉండొచ్చని స్పైస్‌జెట్ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







