పామ్ జుమైరా బోర్డ్ వాక్ అందుబాటులోకి
- November 22, 2016
11 కిలోమీటర్ల బోర్డ్ వాక్ పామ్ జుమైరాలో అందుబాటులోకి వచ్చింది. నఖీల్ ఛైర్మన్ అలి రషీద్ లూటా దీన్ని ప్రారంభించారు. 150 మిలియన్ దిర్హామ్ ఖర్చుతో దీన్ని రూపొందించారు. ఫిట్నెస్ కోసం వచ్చేవారికీ, లీజర్ టైమ్‌ని ఎంజాయ్ చేయాలనుకునేవారికీ ఇది చక్కని ప్రాంతంగా మారనుంది. బోర్డ్ వాక్‌పై వివిధ రకాలైన ఫుడ్ ట్రక్స్ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నఖీల్ ఛైర్మన్ అలి రషీద్ లూటా మాట్లాడుతూ, బోర్డ్ వాక్ ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనమనీ, సరికొత్త ఆలోచనలతో పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటుగా, సర్వాంగ సుందరమైన అనుభూతిని అందరికీ కల్పించడానికి వీలవుతోందని, పామ్ జుమైరాకి ఇదో ప్రధాన ఆకర్షణ కానుందని అన్నారు. ఇప్పటికే పామ్ జుమైరాలో జాగింగ్, సైట్ సీయింగ్ వంటి సౌకర్యాలున్నాయి. వాటికి అదనంగా ఇంకా సరికొత్త అందాలు ఎన్నో సంతరించుకోనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







