ఫోర్జరీ: ఇద్దరు ట్రాఫిక్ పోలీస్‌మెన్‌కి జైలు
- November 22, 2016
మనామా: ఇద్దరు పోలీసులకు ఏడు మరియు ఐదేళ్ళ జైలు శిక్షను ఫోర్త్ సుప్రీమ్ క్రిమినల్ కోర్ట్ ఖరారు చేసింది. ట్రాఫిక్ యాక్సిడెంట్ రిపోర్టుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్ల రిపోర్టుల్ని తారుమారు చేసి, ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి అక్రమంగా డబ్బుల్ని రాబట్టిన కేసులో వీరిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. మిగతా నలుగురికి పన్నెండేళ్ళ జైలు శిక్ష విధించారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిథులకు అనుమానం వచ్చి, పోలీసులను ఆశ్రయించగా, విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో, ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. విచారణలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల్ని దోషులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







