షూటింగ్ పూర్తిచేసుకున్న శాతకర్ణి
- November 22, 2016
బాలకృష్ణ- శ్రియ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. 2017 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయింది. రీషూట్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టినా యూనిట్ మాత్రం సైలెంట్‌గా తమ పని కానిచ్చేసింది.
చిత్రీకరణకు 80 రోజులను టార్గెట్‌గా పెట్టుకున్న డైరెక్టర్ క్రిష్, ఒకరోజు ముందుగానే అంటే 79 రోజులకే ఫినిష్ చేసినట్టు సమాచారం. బాలకృష్ణ సహకరించడం వల్లే ఈ వేగంతో పూర్తి చేసినట్టు క్రిష్ తన ఫ్రెండ్స్ వద్ద చెప్పాడట. హీరో సహకారానికి విజువల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగానే వస్తున్నాయట. గ్రాఫిక్స్ పని కూడా అనుకున్నట్టు టైమ్‌కే పూర్తయితే జనవరి 12న థియేటర్స్‌కి తీసుకురావాలన్నది యూనిట్ ఆలోచన. నార్మల్‌గా హిస్టరీ బేస్డ్ మూవీ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. దీనికితోడు విజువల్ ఎఫెక్ట్స్ భారీగా వాడాల్సిందే! అలాంటి ఇంతవేగంగా ఎలా సాధ్యమంటూ చర్చించు కోవడం ఫ్యాన్స్ వంతైంది. మరోవైపు సంక్రాంతికి వచ్చి విజయవంతం కావాలని ఆశిస్తూ నవంబర్ 28 కార్తీక సోమవారం రోజున దేశవ్యాప్తంగా 1116 శివాలయాల్లో మహారుద్రాభిషేకంను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







