విమానాల్లో వైఫై సేవలు ...

- November 23, 2016 , by Maagulf
విమానాల్లో వైఫై సేవలు ...

భారత విమానాల్లో ప్రయాణికులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సెక్రెటరీ కమిటీకి టెలికమ్యూనికేషన్‌ శాఖ ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా రాజ్యసభలో తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ కంట్రోల్‌ సిస్టంతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఈ వైఫై వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. దీని వల్ల విమానాల నిర్వాహణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఈ ప్రతిపాదనలను అమలు చేయాలంటే భారత టెలిగ్రాఫ్‌ చట్టం-1885లో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు విమానయాన సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయి. భద్రత కారణాల వల్ల చాలా కాలంగా ఈ సేవలను భారత్‌ దూరంగా ఉంచింది.కాగా, కొన్ని భారత సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 'విస్తారా' సంస్థ ఇప్పటికే విమానంలో వైఫై కోసం ట్రయల్‌ నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com