అబుధాబీలో వదిలివేయబడ్డ 2668 వాహనాలు స్వాధీనం
- August 31, 2015
ఈ సంవత్సరారంభం నుంచి, ముసాఫా ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాల్లోనూ, నివాస ప్రాంతాల్లోనూ వదిలివేయబడిన 3142 వాహనాలను గుర్తించి, వాటిలో 2668 వాహనాలను ద అబుధాబీ సిటీ మునిసిపాలిటీ స్వాధీనం చేసుకుంది. వదిలివేయబడ్డ వాహనాలను తరలించడానికి నోటిస్ పీరియడ్ 14 రోజుల నుండి 3 రోజులకు కుదించిన సంగతి విదితమే! అనంతరం యజమానులకు నోటీసు ఇచ్చి, సంబంధిత ఇనస్పెక్టర్ వాహనాలను తరలించే కంపెనీకి తొలగించడానికి పురమాయిస్తారు. ఈ చట్టం ట్రైలర్లు, బోట్లు మరియు అన్ని ఇతర వాహనాలకు వర్తిస్తుంది. జరిమానాగా 3000 దీనర్లు, మరల పునరావృతమైతే అందుకు రెండింతలు విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







