హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని పర్యటన
- November 26, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరబాద్ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు భాగ్యనగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మోదీ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన జాతీయస్థాయి డీజీపీల సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన ప్రవేశద్వారాల వద్ద రాష్ట్ర పోలీసులతోపాటు ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీ బయల్దేరారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









