హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో పి.వి.సింధు ఓటమి

- November 27, 2016 , by Maagulf
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో పి.వి.సింధు ఓటమి

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ పి.వి.సింధు ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో తైపీ షట్లర్ తై జు యింగ్ చేతిలో 15-21, 17-21 స్కోరుతో పరాజయం పాలైంది. గత ఆదివారం చైనా సూపర్ సిరీస్‌ను గెలుపొంది, జోరు మీదున్నసింధు హాంకాంగ్ ఓపెన్‌లో కూడా ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఆదివారం కూడా రెండో సూపర్ సిరీస్ విజేతగా నిలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com