ఆర్మీ హెలికాప్టర్ కూప్పకూలి ముగ్గురి మృతి
- November 30, 2016
భారత ఆర్మీ అధికారులు వెలుతున్న హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెంది ఒకరికి తీవ్రగాయాలైన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. భారత ఆర్మీ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బుధవారం ఉదయం 11.45 గంటల సమయంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్ లోని సుక్నా ప్రాంతంలో వెలుతున్నది. ఆ సమయంలో హెలికాప్టర్ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.
అందులో ప్రయాణిస్తున్న ముగ్గరు ఆర్మీ అధికారులతో సహ పైలట్ దుర్మరణం చెందారు. మరో జూనియర్ కమిషన్డ్ అధికారికి తీవ్రగాయాలైనాయని అధికారులు చెప్పారు. హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయిందని, ప్రమాదానికి కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







