మా బాబాయ్ బెస్ట్ అంటున్న రామ్ చరణ్!!
- September 01, 2015
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కు సంభందించిన కొత్త పోస్టర్ ని వదిలిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన అన్న కుమారుడు హీరో రామ్ చరణ్ ఈ పోస్టర్ చూసి ప్రశంసిస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో కామెంట్ చేసారు. రామ్ చరణ్ ఏమన్నారో క్రింద చూడండి. Congrats!! Team Sardar... The best poster of babai till date... Posted by on మరో ప్రక్క పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ రామ్ చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' కొత్త టీజర్ ని వదిలింది యూనిట్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో రన్ అవుతోందని చెప్పే విధంగా ఈ టీజర్ రూపొందింది. మీరూ ఈ టీజర్ పై ఓ లుక్కేయండి. ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు. ఆయనేం అన్నారో ఈ క్రింద ట్వీట్ లో చూడండి. "వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ముందుకు వెల్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. చరణ్ ఫైట్ మాస్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్ ఫైట్ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట. ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.
తాజా వార్తలు
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!







