షూటింగ్ పూర్తిచేసుకున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి'

- December 01, 2016 , by Maagulf

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. చిత్రంలో శాతకర్ణి తల్లి గౌతమి పాత్రను పోషిస్తున్న హేమమాలిని ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. సినిమా స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. రెండో శతాబ్దానికి చెందిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ 100వ చిత్రంగా వస్తున్న దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, వై.

రాజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com