ఆర్బీఐ ఏపీ, తెలంగాణకు నగదు తరలించింది...

- December 02, 2016 , by Maagulf
ఆర్బీఐ ఏపీ, తెలంగాణకు   నగదు  తరలించింది...

ఏపీ, తెలంగాణలో ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానాలాల్లో భారీగా నగదును తరలించింది ఆర్బీఐ. తెలంగాణకు 1600 కోట్లు పంపగా, ఆంధ్రప్రదేశ్‌కు 2000 కోట్ల నగదు చేరింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలకు భారీ కంటైనర్లను పంపిన RBI.. వీలైనంత త్వరగా వాటిని బ్యాంకులకు చేర వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు, కేంద్ర ఆర్థిక శాఖ కూడా మనీలాండరింగ్ వ్యవహారాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. హవాలా కేసుల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com