ట్విట్టర్ ఖాతాలో తీవ్రవాద గ్రూప్ వార్తలు పోస్ట్ చేసినందుకు పదేళ్ల జైలుశిక్ష
- December 03, 2016
జెడ్డా : " నాలుకా...వీపునకు దెబ్బలు తీసుకురావద్దని " పాత కాలం సామెత కానీ, అది కాస్త ఇపుడు మారి " చేతులూ..సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి జైలుశిక్షలు కోరి కోరే తెచ్చుకోవద్దని " ఆధునీకరించాల్సిఉంది.. నా పేజీ...నా ఇష్టం అనుకోవడం సెండ్ బటన్ నొక్కనంతవరకే ..పబ్లిక్ లోనికి పోస్ట్ ఒకసారి వెళ్లిందో ..వేల కళ్ళు వాటిని చదువుతాయిని కొందరు తరచూ మర్చిపోతుంటారు. రియాద్ ప్రత్యేక నేర న్యాయస్థానం ఒక సౌదీ వ్యక్తికి 10 సంవత్సరాల జైలుశిక్ష, 50,000 వేల సౌదీ రియాళ్ళు జరిమానా మరియు జైలు నుంచి విడుదల అయిన తర్వాత కింగ్డమ్ ను విడిచి వెలుపల ప్రయాణ నిషేధ శిక్ష విధించింది. ఆ ముద్దాయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా దేష్ తీవ్రవాద సంస్థకు చెందిన వార్తలను పోస్టు చేస్తున్నట్లు కనుగొనబడింది. అంతేకాక తీవ్రవాద గ్రూప్ యొక్క ట్వీట్లు ద్వారా ప్రభావితం కాబడి వారికి మద్దతు ఇవ్వడమే కాక, భద్రతా సిబ్బంది బెదిరింపు లేఖలు రాసేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ వ్యక్తి ఒరిజినల్ ఖాతాను తొలగిస్తే తర్వాత మరో ఒక తప్పుడు ఐ.డి ని సృష్టించటంతో పాటు తిరిగి తన కార్యకలాపాలు ముద్దాయి కొనసాగిస్తూనే ఉన్నాడని కనుగొనబడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







