కువైట్ లో ఆస్తమాతో గత రెండురోజులుగా ఐదుగురు మృతి
- December 03, 2016
కువైట్ : ఆస్తమా ప్రబలడంతో ఐదుగురు మృతి చెందినట్లు మరియు పలువురు గత రెండురోజులుగా శ్వాస అంధక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఖలీద్ అల్ సాహ్లావి శుక్రవారం తెలిపారు.పలు ఆస్పత్రులలో రెండు రోజుల్లో 844 మంది శ్వాస అంధక ఇబ్బందులకు గురై అత్యవసర కేసులుగా నమోదు కాబడినట్లు ఆయన తెలిపారు. వీరిలో ఐదుగురు మరణించారు ముబారక్ ఆసుపత్రిలో ముగ్గురు మరియు అమిరి హాస్పిటల్ లో ఇద్దరు అల్ సాహ్లావి ఒక ప్రకటనలో తెలిపారు. ఇరవై ఆరు కేసులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లులలో చికిత్స పొందుతుండగా, 45 గదులలో మిగిలినవారు చికిత్స పొందుతున్నారు. అత్యవసర క్లినిక్ లు ఏ వైద్య పరిస్థితులు స్వీకరించేందుకు అయినా సిద్ధంగా ఉన్నాయని ఆయన పౌరులు మరియు నివాసితులు జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్య సలహా కోసం అత్యవసర పరిస్థితులలో ఫోన్ కాల్ (112) లేదా (151) సమాచారం అందించాలని కోరారు. అల్-అసిమా హెల్త్ డైరెక్టరేట్ ముఖ్యులు డాక్టర్ ఫాతిమాఅల్ అసౌమి వివరిస్తూ( హెచ్ 1 ఎన్ 1 ) కారణంగా ఒక పాండమిక్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా అమిరి హాస్పిటల్ లో రెండు అంతస్తులు మూసివేత మంచిదని ఫ్లూ వైరస్ ప్రజానీకంలో కాలానుగుణ మార్పు చెంది ప్రమాదకర ఫ్లూ గా మారింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







