చైనాలోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం...

- December 04, 2016 , by Maagulf
చైనాలోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం...

చైనాలోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. చిఫెంగ్‌ పట్టణంలోని బౌమా మైనింగ్‌ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో 181 మంది అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తుండగా.. వారిలో 149 మంది ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడినట్లు జిన్హువా వెల్లడించింది.పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. కాగా.. ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. పోలీసులు, మెడికల్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆదివారం సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com