థియేటర్లలో పాత 500, 1000 నోట్లు తీసుకునేందుకు అనుమతివ్వాలి--మన్సూర్‌

- December 04, 2016 , by Maagulf
థియేటర్లలో పాత 500, 1000 నోట్లు తీసుకునేందుకు అనుమతివ్వాలి--మన్సూర్‌

తమిళ సినిమాలో మన్సూర్‌ ఆలీఖాన్ భిన్నమైన నటుడిగా పేర్కొనవచ్చు. రీల్‌పై ప్రదర్శించే నటనగానీ, రియల్‌గా ప్రవర్తించే విధానంలో గానీ ఇతర నటులకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారన్న పేరు ఉంది. ఈ మధ్య విలన్ వేషాలు తగ్గించి సొంత బ్యానర్‌లో హీరోగా నటిస్తున్న మన్సూర్‌ తాజాగా కొత్త ప్రతిపాదనతో మీడియా ముందుకొచ్చారు. థియేటర్లలో పాత 500, 1000 నోట్లు తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు చెన్నైలోని ఆర్‌కేవీ స్టూడియోస్‌లో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటన తరువాత దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయడం తప్పనడం లేదు.

అయితే ఈ ప్రయత్నం నల్లకుబేరులు ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. సామాన్య ప్రజలే బాధపడుతున్నారు. సినీపరిశ్రమకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి. థియేటర్లు మూసివేసే పరిస్థితి నెలకొంది.

పెద్ద నోట్లు చెలామణీ పూర్తిగా నిలిపివేసే మార్చి 31వ తేదీ వరకు థియేటర్లలో పాత 500, 1000 నోట్లు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరుతున్నాను' అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com