ఈ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తో ఆరోగ్యం మీ సొంతం
- September 02, 2015
ఆధునిక కాలంలో తిండి దగ్గర నుంచి శారీరక శ్రమ వరకూ మన అలవాట్లన్నీ మారిపోయాయి. గతంలో ముతక ధాన్యాలు, తృణ ధాన్యాలు, రకరకాల పండ్లు, ముడి పప్పుల వంటివన్నీ తినేవారు. వాటితో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలీష్ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్ధాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. అలాగని మళ్లీ పూర్తిగా ముతక ధాన్యాలు, దంపుడు బియ్యం, రొట్టెల్లాంటి వాటికి పూర్తిగా మారిపోవటం కష్టం కాబట్టి.. మనం తినే ఆహారంలోనే 'పీచు' మోతాదు పెంచుకునేదెలా? అన్న అవగాహన పెంచుకుని.. అందుకు తగ్గట్టుగా మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యం! ఫైబర్ రిచ్ ఆహారం మన శరీరంనకు పోషకాలను అందిస్తుంది. దీనిలో యాంటిఆక్సిడెంట్, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందువలన గుండెపోటు,క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం మీ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. ఫైబర్ ఫుడ్స్ మలబద్దకాన్ని, హెమరాయిడ్స్ మరియు డివర్టిక్యులోసిస్, వంటి వ్యాదులను తగ్గిస్తాయి.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







