16న తిరుమలలో విడుదల కానున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో
- December 05, 2016
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుకలకు తిరుపతి వేదిక కానుంది. ఈ నెల 16న భారీగా నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన స్థల పరిశీలన నిమిత్తం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, బాలకృష్ణ వ్యక్తిగత పీఆర్వో సురేంద్ర నాయుడు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. వీరు ఎస్వీ యూనివర్శిటీ, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామై దానాలను పరిశీలించారు. అనంతరం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ వేడుకలకు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాల కృష్ణతో చర్చించాక 2 రోజుల్లో వేదికను అధికారికంగా ప్రకటి స్తామని తెలిపారు. ఈ నెల 16న తేదిన నిర్వహించే ఈ ఆడియో వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అతిథులుగా హాజరు కానున్నట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







