జయ ఆరోగ్యంపై వచ్చిన రుమర్స్ అవాస్తవం: అపోలో హాస్పిటల్స్
- December 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో చెన్నై అట్టుడికిపోయింది. జయలలిత కన్నుమూశారంటూ కథనాలు రావడంతో తమిళనాడు ఒక్కసారిగా వేడెక్కింది. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిపైకి అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ విధ్వంసాలకు పూనుకున్నారు. ఆస్పత్రిపైకి రాళ్లతో విరుచుకుపడ్డారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జాతీయ మీడియా సంస్థలు సైతం జయలలిత కన్నుమూశారని కథనాలు ఇవ్వడంతో ఏం జరుగుతున్నదో అర్థం కాక చెన్నై నగరం కుతకుతలాడింది.
అయితే, ఈ కథనాలను, వదంతులను అపోలో ఆస్పజయ ఆరోగ్యంపై వచ్చిన రుమర్స్ అవాస్తవం: అపోలో హాస్పిటల్స్త్రి కొట్టిపారేసింది. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని, ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. జయలలిత ఆరోగ్యంపై తాము అధికారికంగా ఏమీ చెప్పకముందే ఆమె గురించి వదంతులు వచ్చినట్టు స్పష్టంచేసింది. అపోలో, ఎయిమ్స్‌కు చెందిన పెద్ద వైద్యబృందం అమ్మకు లైఫ్ సేవింగ్ చికిత్స కొనసాగిస్తున్నదని అపోలో ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..







