జయలలితకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు

- December 06, 2016 , by Maagulf
జయలలితకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్‌ వద్ద ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జయలలిత నెచ్చెలి శశికళ, అమ్మ నమ్మిన బంటు పన్నీర్‌ సెల్వాన్ని పరామర్శించారు. మోదీ వెంట మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే జయలలిత అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com