సూర్య చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్న రమ్య కృష్ణ
- December 07, 2016'బా హుబలి' సినిమా తర్వాత మళ్లీ రమ్యకృష్ణ నటిగా బిజీ అయిపోయింది. పలు భాషల నుంచి ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తమిళంలోనైతే కీలకమైన చిత్రాల్లో ఆమె దర్శనమిస్తోంది. తాజాగా సూర్య చిత్రంలోనూ ఆమెకి ఓ ప్రధాన పాత్ర దక్కింది. సూర్య కథానాయకుడిగా విఘ్నేష్‌శివన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కథానాయిక నయనతార ప్రియుడైన విఘ్నేష్ ఒకప్పుడు సూర్యకి అభిమాని. ఇప్పుడు తన అభిమాన కథానాయకుడితో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకొన్నాడు. ఆ సినిమాలోనే రమ్యకృష్ణకి ఓ కీలక పాత్రని కట్టబెట్టాడు. పెద్దయెత్తున రమ్యకృష్ణ కాల్షీట్లని ఇప్పించుకొన్నారట.దీన్నిబట్టి ఆమె ఎంతటి ప్రధానమైన పాత్ర చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తారని తెలిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







