16న రానున్న 'చిన్నారి'

- December 08, 2016 , by Maagulf
16న రానున్న 'చిన్నారి'

ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'మమ్మీ'. తెలుగులో ఈ చిత్రాన్ని 'చిన్నారి' పేరుతో డిసెంబరు 16న విడుదల చేస్తున్నారు. గతంలో కన్నడంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో కె.ఆర్‌.కె. ప్రొడక్షన్స్‌, లక్ష్మీ వేంకటేశ్వర మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కె. రవికుమార్‌, ఎం.ఎం.ఆర్‌. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లోహిత్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. హర్రర్‌, చైల్డ్‌ సెంటిమెంట్‌తో గోవా నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com