అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన చిరు

- December 08, 2016 , by Maagulf
అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన చిరు

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబరు 150' టీజర్‌ విడుదలైంది. చిత్ర బృందం ఇవాళ సాయంత్రం టీజర్‌ను విడుదల చేశారు. 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌' అంటూ చిరు చెప్పిన డైలాగ్‌ వింటుంటే నిజంగా బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అన్నట్లుగానే ఉంది.
వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబర్‌ 150' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com