రానున్న రెండు రోజుల్లో ఒమాన్ లోవర్షాలు!
- September 03, 2015
పబ్లిక్ ఆధారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరక్టర్ జనరల్ ఆఫ్ మేటియరాలజీ వారి సమాచారం ప్రకారం, సుల్తానెట్ లోని ఉత్తర భాగంలో గురువారం మధ్యాహ్నం నుండి వరుసగా రెండు రోజుల పాటు వర్షాలు పడతాయి. ఉత్తర మరియు దక్షిణ అల్ బతినా, ముసందం, అల్ ధరియా, అల్ హాజర్ పర్వత ప్రాంతాలు మరియు సమీప ప్రదేశాల్లో అల్ప పీడన ద్రోణి ప్రభావం వలన తాజా గాలులతో కూడిన తుఫాను జల్లులు పదే అవకాశం ఉంది. ఇక సముద్రం తీరప్రాంతాలలో చాలావరకు సాధారణం నుండి ఒక మాదిరి భీభత్సంగా ఉండే అవకాశం ఉంది. తమ సూచనలను పాటించి, అప్రమత్తంగా ఉండవలసినదిగా ఒమాన్ వాతావరణ శాఖ వారు హెచ్చరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







