ఆడ జన్మ

- September 03, 2015 , by Maagulf
ఆడ జన్మ

స్కానింగుల పేరుతో వృత్తి ధర్మాన్ని మరిచి
మగువ జాతికి మానవత విలువలకు మచ్చ తెస్తున్న
ఓ డాక్టారమ్మా ఓ డాక్టారయ్యా ఓ  అమ్మ నాన్నా వినండి
తల్లి గర్భంలో ఉన్న ఆడ శిశువు యొక్క ఆత్మ రోధనను ..

స్కానింగుల పేరుతో డాక్టార్లు యములవ్వగా
అబార్షన్ల పేరుతో కన్న వారు నను చంపేయగా
నా గుండె ఎంత రోధిస్తుందో మీకు తెలుసునా మరి?

మాట రాని పసిపాపను లోకం చూడని చిన్నారిని
అమ్మా అని పిలువలేను నాన్న అని అరువలేను
ఆడ శిశువు అని తెలియగానే నన్ను ఆదిలోనే చంపేస్తే
నా అంతరాత్మ రోధించదా,మీకు మనస్సంటు లేదా?

నా చిట్టి పొట్టి ఉంగు ఉక్కు ముచ్చటా మీకు నచ్చదా
ఈ చిన్నారి బుడి బుడి నడకలు మీరు ఇక చూడరా
ఆశతో అడుగుతున్నాను చిరు ఆశతో కోరుతున్నాను
అమ్మా అని నాన్న అని పిలిపించుకోరా మీరు
చిట్టితల్లి అని చిన్ని పాప అని మీ ఒడి చేర్చుకోరా?

అమ్మా అని పిలువాలని ఉంది
నాన్న అని చెయ్యి పట్టాలని ఉంది
ఒక్క సారి అమ్మా అని పిలిచి
ఇంకొక్క సారి నాన్న అని పిలిచి
కన్న వారిని కళ్ళ నిండ చూసి
ఇక నే కనుమరుగైన పర్వలేదని
ఈ చిన్ని గుండె వేడుకొంటోంది..

నా మాటలు మీకు వినబడవు
నా ఆత్మ రోధన మీకు కనబడదు
తల్లి గర్భమే నాకు నరక లోకమా
కన్నవారే నా మరణంకు కారణమా
డాక్టర్లే నా ప్రాణాలు తీసేదా
వద్దండి ఆదిలోనే నన్ను చంపేయకండి ..

అమ్మా నా గుండె రగిలిపోతుంది
నాన్న నా అంతరాత్మ రోధిస్తున్నది
దేవుడు వేయని శిక్ష మీరు వేస్తున్నారని..

ఆపండి ఆపండి ఈ స్కానింగులు ఈ అబార్షన్లు
ఆడ మగ అని మీ మనసు నుండి తీసేయండి
నా పిండాన్ని తీసేచి పిసాచులుగా నిలిచిపోకండి..

రాముడు ఏలిన రాజ్యము మనది
శ్రీ కృష్ణుడు నడిచిన నేల మనది
మనకు మానవత్వం ఉంది
మనము మనుషులమే
ఆడ శిశువును అమ్మలా
బావిద్దాం,జై హింద్!!

--శేఖర్.మల్యాల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com