ఖతార్లో ప్రవాస శ్రామికుల చెంతకే మొబైల్ ఎ. టి. ఎం. లు
- September 03, 2015
ఖతార్ ప్రభుత్వం వారి కొత్త 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' WPS కు తమ వంతు సహకారంగా, ప్రవాస కార్మికులు సమ్మర్ధంగా ఉండే చోట్లలో మొబైల్ ఎ. టి. ఎం. యంత్రాలను నియోగించనున్నట్టు అహ్లి బాంక్ వారు ప్రకటించారు. ఖతార్ కార్మిక మరియు సాంఘిక సంక్షేమ శాఖ వారు ఈ నవంబరు 3 నుండి WPS పద్ధతి ప్రకారం ఎలక్ట్రానిక్ విధానంలో వేతనాలు బాంకులలో ఉద్యోగుల ఖాతాలలో జమ చేయబడతాయని ప్రకటించిన సంగతి విదితమే! ఐతే ఈ విధానం వలన ఎ. టి. ఎం. వాడకందారుల సంఖ్య పెరిగి, వాటికీ కొరత వస్తుందని శ్రామికులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అహ్లి బాంకు వారి సాధారణ విస్తరణ వ్యూహంలో భాగంగా, 2016 సంవత్సర ఆరంభానికల్లా మొబైల్ ఎ. టి. ఎం. సేవలను లేబర్ కేoపులు, పెద్ద ఈవెంట్లు వంటిచోట అందుబాటులో ఉంచుతామని, వేతనాల చెల్లింపు రోజులో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా సిద్ధం చేస్తున్నామని బాంకు డేప్యూటీ సి. ఈ. ఓ. ఆండ్రూ మెక్ కెచ్నీ తెలిపారు. ఇక దోహా మెట్రో ప్రోజెక్టు పూర్తయిన అనంతరం, ఆ స్టేషన్లు ఆట్మ్ సేవలు అందించే మరిన్ని అవకాశాలకు నెలవౌతాయన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







