పెదాలను సంరక్షించుకోండి ఇలా
- September 03, 2015
చిరు మందహాసానికి వేదికైన అధరాలు ముఖానికి అదనపు అందాన్ని అందిస్తాయి. ఈ పెదాలు మరింత నాజూగ్గా కనిపించాలంటే ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి.
సగం చెంచా శనగపిండి తీసుకొని దానిలో కొన్ని చుక్కలు రోజ్‌వాటర్, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో రెండు రోజులకోసారి పెదాలను రుద్దుకోవాలి.
అరటి పండు గుజ్జు, బొప్పాయి గుజ్జు, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, కొద్దిగా తేనె కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని పెదాలపై బాగా రుద్దుకొని తరువాత కడుక్కోవాలి.
ఒక టీ స్పూన్ ఆలీవ్ ఆయిల్‌కి కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో పెదాలను రుద్దుకుంటే మృత కణాలు తొలగిపోయి పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
కలబంద గుజ్జుకు కొద్దిగా నిమ్మరసం కలిపి దాన్ని పెదాలకు రాసుకోవాలి. తరువాత బ్రష్‌తో రుద్దాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే పెదాలు ఎర్రగా మృదువుగా ఉంటాయి.
గులాబీ రెబ్బలను పేస్టులా చేసి దానికి కొంచెం వెన్న కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసుకొని మర్దనా చేయాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు పెదాలు ఎర్రగా తయారవుతాయి.
ఒక టేబుల్‌స్పూన్ కాఫీ పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి పెదాలకు రాసుకొని రుద్దాలి. దీన్ని ఐదు నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఆ తరువాత కొబ్బరి నూనెగానీ, ఆలివ్ నూనె గానీ రాసుకొంటే పెదవులు మృదువుగా ఉంటాయి.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







