త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్'
- December 10, 2016
త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్'ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సకల హంగులతో కూడిన టీ-హబ్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ తయారు చేయడం దేశంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. టీ వ్యాలెట్‌లో ప్రజల సౌకర్యం, భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ వారంలోనే టీ-వ్యాలెట్ లోగోను ఆవిష్కరింపజేస్తామన్నారు. టీ-వ్యాలెట్ వినియోగానికి ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని చెప్పారు. స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్‌సెంటర్ ద్వారా టీ-వాలెట్ సేవలు పొందవచ్చన్నారు. ఫోన్ లేకుండా కూడా టీ-వ్యాలెట్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







