కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...
- December 11, 2016
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి నైరోబి-నైవిషా హైవేపై పెట్రోల్ ట్యాంకర్ వాహనాలను ఢీకొట్టి పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక బస్సు సహా 10 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







