కుప్పకూలిన చర్చ్... 160 మంది దుర్మరణం
- December 11, 2016
నైజీరియాలోని ఆక్వా ఇబోమ్ రాష్ట్రంలోని ఉయోలో నిర్మాణంలో ఉన్న 'ది రెయినర్స్ బైబిల్ చర్చ్' అనూహ్యంగా కూలిపోవడంతో దాదాపు 160 మంది మరణించారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పాల్గొన్నారు. ఐరన్ రాడ్లు, సిమెంటు, రాళ్ళ క్రింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గవర్నర్ ఉడోమ్ మాట్లాడుతూ ఈ దుర్ఘటనతో తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఇదిలావుండగా, ఉయో టీచింగ్ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.క్షతగాత్రులతో ఆసుపత్రి పడకలు నిండిపోతున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







