జూనియర్ మన్యంపులికి ఫుల్ క్రేజ్
- December 12, 2016మల్లూవుడ్ లో మెగా హిట్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ మన్యంపులికి తెలుగు నాట కూడా విశేష స్పందన లభిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే సినీజనాలు నీరాజనాలు పడుతున్నారు. సూపర్ హిట్ టాక్ తో మన్యంపులి విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మన్యంపులిలో చిన్నప్పటి మోహన్ లాల్ గా నటించిన మాస్టర్ అజాస్ థియేటర్స్ లో ప్రేక్షకుల్ని స్వయంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో అజాస్ పర్యటణ కొనసాగింది. వెళ్లిన ప్రతి చోటా అజాస్ కు అభిమానుల నుంచి హై రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉంటే మళయాలంలో బాహుబలికి మించిన సక్సెస్ ను తెలుగునాట మన్యంపులికి అందించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు ఈ చిత్ర నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఓ విజువల్ ట్రీట్ ను టాలీవుడ్ ఆడియెన్స్ కి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ఆయన ఆన్నారు. అలానే మోహన్ లాల్ నటన, పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్, గోపీ సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ అని, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తోందని సింధూరపువ్వు కృష్ణారెడ్డి చెప్పారు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా అలరిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







